ఫిబ్రవరి 28: టెలికాం రంగాల్లో దిగ్గజ సంస్థల దెబ్బకు చిన్న చిన్న కంపెనీలు విలీనం బాట పట్టాయి. ఈ నేపథ్యంలోనే ఐడియా వొడాఫోన్ తో జత కట్టిన విషయం తెలిసిందే. వినియోగదారులను కాపాడుకునే అంశంతో ప్రత్యేక ఆపర్లను ప్రకటించి విలీనబాట పట్టిన కంపెనీలు చాలా ఉన్నాయి. ఇందులో భాగంగా వోడాఫోన్ ప్రత్యర్థుల కంపెనీలకు ధీటుగా సరికొత్త ప్లాన్‌ను అందు బాటులోకి తీసుకొచ్చింది. జియో, ఎయిర్‌టెల్ కంపెనీలను దెబ్బకొట్టేలా వోడాఫోన్ రూ.129 ప్రీపెయిడ్ ప్లాన్ తీసుకొచ్చింది.
వోడాఫోన్ న్యూ ఆఫర్స్ :
వోడాఫోన్ రూ.119తో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 1జిబి డేటా లభిస్తుంది. ఇందులో అన్ లిమిటెడడ్ కాల్స్ ,100 ఎసెమ్మెస్ లు లభిస్తాయి.ఈ ప్లాన్ వాలిడిటీ 28రోజులు.
వోడాఫోన్ రూ.169తో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 1జిబి డేటా లభిస్తుంది. ఇందులో అన్ లిమిటెడడ్ కాల్స్ ,100 ఎసెమ్మెస్ లు లభిస్తాయి.ఈ ప్లాన్ వాలిడిటీ 28రోజులు.
వోడాఫోన్ ఐఫోన్ ఫరెవర్ ప్రోగ్రాంను ప్రారంభించింది, దాని వినియోగదారులకు ఏవైనా నష్టాలకు సంబంధించి మరమ్మత్తు ఖర్చులు గురించి చింతించకుండానే తమ ఐఫోన్లను ఉపయోగించడాన్ని కొనసాగించవచ్చు. ఈ కార్యక్రమంలో భాగంగా అత్యల్ప ధర వద్ద తాజా ఐఫోన్ కు కూడా అప్గ్రేడ్ చేయవచ్చు. ఈ ఆఫర్ అన్ని వోడాఫోన్ ఐడియా ఎంటర్ప్రైజ్ కస్టమర్లకు కూడా వర్తిస్తుంది.
ఈ ఆఫర్ ను యాక్టివేట్ చేసేందుకు వినియోగదారులకు వొడాఫోన్ రెడ్ ఐఫోన్ ఫార్వార్వర్ ప్లాన్ లేదా ఐడియా నిర్వాణ ఐఫోన్ ఫార్వార్వర్ ప్లాన్ కేవలం రూ .649 నెలసరి ప్లాన్ చెల్లించాలి.ఫ్రీ ఐఫోన్ ఫరెవర్ సర్వీస్ కోసం రిజిస్ట్రేషన్ చేయడానికి స్టోర్ నుండి iForever యాప్ ను డౌన్లోడ్ చేయండి.