అతిలోక సుందరిగా మాధురీ దీక్షిత్...?

SMTV Desk 2019-02-26 11:56:01  Sridevi, Madhuri dixit, Boni kapoor, Sridevi biopic

ముంబై, ఫిబ్రవరి 26: ప్రస్తుతం సినీ పరిశ్రమలో బయోపిక్ ల హవా నడుస్తుంది. నిర్మాతలు, దర్శకులు ఎక్కువగా బయోపిక్ లనే నమ్ముకుంటున్నారు. వీరిలో కొందరు దర్శకనిర్మాతలు ఈ ఫార్ములాతో సక్సెస్ అవ్వగా, మరికొందరు బోల్తా పడ్డారు. ఇప్పటికే ఎన్నో బయోపిక్ లు తెరపై సందడి చేసాయి. మరికొన్ని బయోపిక్ లు సెట్స్ పై ఉన్నాయి. ఇప్పుడు బయోపిక్ జాబితాలో అతిలోక సుందరి శ్రీదేవి బయోపిక్‌ కూడా చేరింది. ఆదివారం శ్రీదేవి వర్థంతి సందర్భంగా ఆమె బయోపిక్‌ మరోసారి తెరపైకి వచ్చింది. శ్రీదేవి బయోపిక్‌ను నిర్మించేందుకు ఆయన భర్త బోనీ కపూర్‌ ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో శ్రీదేవిగా నటించడానికి మాధురి దీక్షిత్ పేరును పరిశీలిస్తున్నారని సమాచారం. అన్నీ ఓకే అయితే మాధురీ దీక్షిత్ ను తెరపై శ్రీదేవి పాత్రలో చూడవచ్చు.