వైన్ తాగితే బరువు తగ్గుతారు...

SMTV Desk 2019-01-07 12:23:04  Weight, White wine, Red wine, Advantages

తరచుగా ప‌రిమిత మోతాదులో వైన్ తాగితే గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయ‌ని, బ‌రువు త‌గ్గ‌వ‌చ్చని చెబుతుంటారు. వైన్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల, అవి కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయని, క‌నుక రోజూ త‌గిన మోతాదులో వైన్ తాగితే ఆరోగ్య‌ ప్రయోజనాలు ఉంటాయ‌ని కూడా వైద్యులు చెబుతుంటారు. అలాగే వైన్ తాగడం వ‌ల్ల బ‌రువు త‌గ్గ‌వ‌చ్చ‌ని కూడా వారు అంటుంటారు. అయితే అస‌లు ఇందులో నిజ‌మెంత ? అంటే.. ఈ విష‌యాన్ని తేల్చ‌డానికే హార్వ‌ర్డ్ యూనివ‌ర్సిటీ సైంటిస్టులు ప‌రిశోధ‌న‌లు చేశారు.


ప‌రిశోధ‌కులు మ‌ధ్య వ‌య‌స్సు ఉన్న 19,220 మంది మ‌హిళ‌ల‌ను 12.9 సంవ‌త్స‌రాల పాటు ప‌రిశీలించారు. వారిలో కొంద‌రు రెడ్ వైన్ తాగేవారు ఉండ‌గా, కొంద‌రు వైట్ వైన్ తాగేవారు ఉన్నారు. ఈ క్ర‌మంలో చివ‌రికి తేలిందేమిటంటే... రెడ్ వైన్ తాగిన వారు బ‌రువు పెర‌గ్గా, వైట్ వైన్ తాగిన వారు బ‌రువు తగ్గిన‌ట్లు గుర్తించారు. అందువ‌ల్ల నిత్యం త‌గిన మోతాదులో వైట్ వైన్ తాగితే బ‌రువు త‌గ్గ‌వ‌చ్చ‌ని, రెడ్ వైన్ తాగితే బ‌రువు పెరుగుతారని సైంటిస్టులు చెబుతున్నారు.