ఇంటి చిట్కాలతో గురక సమస్యలను తగ్గించవచ్చు...

SMTV Desk 2019-01-05 14:40:50  Home tips, Snoring, Health

నిద్ర‌లో ఉన్న‌ప్పుడు ప‌క్క‌న ప‌డుకున్న వారు ఎవ‌రైనా గుర‌క పెడితే అప్పుడు క‌లిగే చిరాకు అంతా ఇంతా కాదు. గుర‌క పెట్టే వారి ప‌క్క‌న ఎవ‌రైనా ప‌డుకుంటే వారికి ఇక అస్స‌లు నిద్ర పోలేరు. ఈ క్ర‌మంలో ప్ర‌శాంత‌మైన నిద్ర‌కు భంగం క‌లుగుతుంది. అయితే కింద తెలిపిన చిట్కాల‌ను పాటిస్తే గుర‌క స‌మ‌స్యలను తగ్గించవచ్చు . ఆ చిట్కాలు ఏమిటంటే...

1. వొక గ్లాసు నీటిలో వొకటి లేదా రెండు పిప్పర్‌మెంట్‌ ఆయిల్‌ చుక్కలు వేసి రాత్రి నిద్రపోయే ముందు నోటిలో పోసుకుని బాగా పుక్కిలించాలి.

2. కొద్దిగా పిప్పర్‌మెంట్‌ ఆయిల్‌ను చేతివేళ్లకు రాసుకుని వాసన చూస్తుంటే గురక తగ్గుతుంది.

3. అర టీ స్పోన్‌ తేనె, అర టీ స్పూన్‌ ఆలివ్‌ ఆయిల్‌ కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది.

4. రాత్రి పడుకునే ముందు మరిగే నీటిలో 4, 5 చుక్కలు యూకలిప్టస్‌ ఆయిల్‌ వేసి ఆవిరి పట్టాలి. దీంతో గుర‌క స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

5. వొక గ్లాసు వేడి నీటిలో అర టీ స్పూన్‌ యాలకుల చూర్ణం కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగి పడుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. గుర‌క స‌మ‌స్య త‌గ్గుతుంది.