వేరుశనగలోని ఆరోగ్య ప్రయోజనాలు

SMTV Desk 2019-01-03 15:34:57  Groundnut, Advantages, Health tips

వంటింట్లో తప్పనిసరిగా వుండేవి పల్లీలు అంటే వేరుశనగలు. ఇవిలేకుండా పొద్దున్న ఇడ్లీలోకి చట్నీ రాదు. కూరలో రుచి రాదు. వేరుశనగపప్పు ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలిసిన విషయమే. పల్లీల్లో బోలెడన్ని పోషకాలు దాగివున్నాయని న్యూట్రీషన్లు అంటున్నారు.

1. వేరుశనగపప్పులో అధిక న్యూట్రీషియంట్స్ ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచడంలో గొప్పగా సహాయపడుతుంది.
2. వీటిలో ప్రోటీన్లు అధికంగా ఉండడం వల్ల, పిల్లల ఎదుగుదలకు తోడ్పడుతుంది.
3. మన రోజువారీ అవసరాలకు కావాల్సిన 86 శాతం నియాసిన్‌ను పల్లీలే అందిస్తాయి. కాబట్టి రోజుకో గుప్పెడు పల్లీలను తినడం అలవాటు చేసుకుంటె వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.
4. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ శరీరంలో సెల్స్ డ్యామేజ్ కాకుండా రక్షణ కల్పిస్థాయి.
5. వేరుశనగలోని అన్ శాచ్యురేటెడ్ ఫ్యాట్ గుండెను ఆరోగ్యంగా ఉండేలా కాపాడుతుంది.

పిల్లలంతా ఇష్టపడే స్నిక్కర్స్‌ వంటి చాకొలెట్లకు ఆ రుచి వేరుశనగ వల్లనేగా వచ్చింది. పల్లీలు పచ్చివి లేదా వేయించినవి తినవచ్చు. రోజుకో గుప్పెడు పల్లీలు తినండి.. ఆరోగ్యంగా ఉండండి. అంటున్నారు ఆరోగ్య నిపుణులు.