లెమన్ టీ తోనూ ఆరోగ్య సమస్యల నివారణ

SMTV Desk 2018-12-25 21:37:55  Lemon tea, Health problems

ఈ రోజుల్లో మార్కెట్ లో వివిధ రకాల టీ లు లభిస్తున్నాయి. అందులో కొన్ని ఉపసమనం కోసం, ఇంకొన్ని రకాల టీ లు ఆరోగ్య సమస్యల నియంత్రణకు ఉపయోగపడుతున్నాయి. అందులో వొక రకమైనది బ్లాక్ టీ . ఇది పాలు, పంచదార కలపకుండా తీసుకుంటారు. కాగా బ్లాక్ టీ లో కొన్ని నిమ్మ చెక్కలను కలిపి తీసుకుంటారు. దీన్నే లెమన్ టీ అని కూడా పిలుస్తారు. అయితే ఈ లెమన్ టీ తాగడం వల్ల అనేకమైన ఆరోగ్య సమస్యలను నయం చేయవొచ్చు.

1. లెమన్ టీ తరచుగా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
2. జీర్ణక్రియను మెరుగుపరచి, జీవక్రియలను చురుగ్గా పని చేయడానికి సహాయ పడుతుంది. శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు వెళ్ళడానికి సహకరిస్తుంది.
3. శరీరంలో ఇన్సులిన్ తగ్గడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు ఉంటాయి. దానికి లెమన్ టీ గొప్పగా సహాయపడుతుంది. లెమన్ టీ ఇన్సులిన్ యాక్టివిటిని ప్రోత్సహిస్తుంది.
4. దినచర్యలో వొక కప్పు లెమన్ టీ తాగడం వల్ల రోజంతా ఉత్సాహంగా గడుస్తుంది.
5. వొత్తిడితో ఉన్నప్పుడు లెమన్ టీ ని వొక కప్పు త్రాగడం వల్ల మిమ్మల్ని రిలాక్స్ గా ఉంచడానికి తోడ్పడుతుంది.
6. లెమన్ టీ తాగడం వల్ల గుండె సంబంధిత సమస్యలను నివారించడానికి సహకరిస్తుందని అనేక పరిశోధనల ద్వారా నిరూపించబడినది.
7.రోజు లెమన్ టీ తీసుకుంటె చర్మ సమస్యలు, ముఖంలో ముడతలు రాకుండా ఉంటాయి.

ప్రతి రోజు నార్మల్ టీతో పాటు లెమన్ టీ అలవాటు చేసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తక్కువ అవుతాయి.