మరికొద్ది సేపట్లో 'తలా' అజిత్ స్పెషల్ ఫోక్ సాంగ్

SMTV Desk 2018-12-20 17:32:15  viswasam, ajith, siva, imman, kollywood,thala

చెన్నై, డిసెంబర్ 20 : 'తలా' అజిత్ కుమార్ ,నయనతార జంటగా తమిళ దర్శకుడు శివ దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం "విశ్వాసం" . ఇటీవల విడుదలయిన పోస్టర్లు, పాటలు దుమ్మురేపుతున్నాయి. ఈ చిత్రానికి డి .ఇమ్మాన్ సంగీత దర్శకునిగా చేస్తున్నాడు . కాగా చిత్రానికి సంబంధించి ఇప్పటికే రెండు లిరికల్ వీడియో సాంగ్స్ ,తో పాటు అన్ని పాటలు జ్యూక్ బాక్స్ లో విడుదల చెయ్యగా , తాజాగా ఈ రోజు సాయంత్రం 7 గంటలకి వొక స్పెషల్ ఫోక్ పాటని కూడా విడుదల చేస్తామని వెల్లడించారు . మాములు పాటగా విడుదలయిన 'అచితూకు' పాటే మంచి మాస్ ట్రాక్ గా అదరకొడుతుంది అలాంటిది ఇది పక్కా ' ఫోక్ ' అని చెప్పి మరి విడుదల చేస్తున్నారు, విన్నోళ్లకి ఇక పూనకాలేనేమో.

ఈ సినిమాని సంక్రాంతి విడుదలకి సిద్ధంచేస్తున్నారు .