జియో ఆకర్షణీయమైన ప్లాన్

SMTV Desk 2018-10-24 17:09:14  rELAINCE jIO, dIWALI OFFER,

నామాత్రపు ధరలతో అపరిమిత వాయిస్ కాల్స్, డాటా, ఎస్.ఏఎం.ఎస్.లు అందజేయడం ద్వారా దేశంలో మొబైల్ ఫోన్ల వాడకంలో బందనాలు తెంచివేసి ప్రజలకు మొబైల్ స్వేచ్చ కల్పించిన రిలయన్స్ జియో సంస్థ, రెండేళ్ల తరువాత కూడా అదే దూకుడు ప్రదర్శిస్తూ దూసుకుపోతోంది.

దీపావళి పండుగ సందర్భంగా జియో ఆకర్షణీయమైన 12 నెలల వార్షిక ప్లాన్ ప్రకటించింది. రూ.1,699 విలువ చేసే ఈ ప్లానుతో ఒక్కసారి రీఛార్జ్ చేసుకొంటే మళ్ళీ వచ్చే ఏడాది దీపావళి వరకు రీ చార్జింగ్ చేసుకోనవసరమే ఉండదు. షరా మామూలుగా ఈ ప్లానులో కూడా ఏడాదిపాటు అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 1.5 జిబి డాటా, 100 ఎస్.ఏఎం.ఎస్.లు లభిస్తాయి. అంటే ఏడాదికి 547.5 జీబీ డేటా లభిస్తుందన్న మాట.

ఇక దీనిపై 100 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ఇస్తుండటం విశేషం. ఈ ఆఫర్ ను పొందాలంటే జియో వినియోగదారులు 2018, నవంబరు 30వ తేదీలోగా దీనిని కొనుగోలు చేయవలసి ఉంటుంది. అయితే ఈ క్యాష్ బ్యాక్ నేరుగా నగదు రూపంలో వినియోగదారులకు రాదు. దీనికోసం జియో అందించే కూపన్లను రిలయన్స్‌ డిజిటల్‌ లేదా రిలయన్స్‌ డిజిటల్‌ ఎక్స్‌ప్రెస్‌ మిని స్టోర్లలో కనీసం రూ.5,000 లేదా ఆపైన విలువగల వస్తువులను కొనుగోలు చేసినప్పుడు ఉపయోగించుకోవచ్చు. కానీ శాంసంగ్, సోనీ షవోమి మొదలైన కంపెనీల ఫోన్లు, ఎక్స్‌టర్నల్‌ హార్డ్‌ డిస్క్‌ డ్రైవ్స్‌ లకు కొనుగోలుకు ఈ 100 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ లభించదు. ఈ 100 శాతం క్యాష్ బ్యాక్ కోసం జారీ చేసిన ఓచర్లు కాలపరిమితి 2018, డిసెంబర్ 31వరకు మాత్రమే. ఆ తరువాత వాటిని ఉపయోగించుకోవడానికి వీలుపడదు.