అమేజాన్ ప్రైమ్ క్రేజీ ఢీల్

SMTV Desk 2018-09-17 17:05:18  NTR Biopic, Amazon

ఎన్.టి.ఆర్ జీవిత కథతో వస్తున్న ఎన్.టి.ఆర్ మూవీ సినిమా నుండి రోజులో పోస్టర్ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడేలా చేస్తుంది. ఎన్.టి.ఆర్ సిని, రాజకీయ అంశాలను ప్రస్థావిస్తూ జనరంజకంగా ఎన్.టి.ఆర్ బయోపిక్ ఉండేలా చేస్తున్నారట. బాలకృష్ణ సొంత ప్రొడక్షన్ లో వస్తున్న ఈ సినిమా లో రానా, సుమంత్, కళ్యాణ్ రాం, విద్యా బాలన్ లాంటి నటీనటులు స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. సినిమా సెట్స్ మీద ఉండగానే ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమాకు భారీ బిజినెస్ జరుగుతుంది. ఈ సినిమా ఓవర్సీస్ లో ఇప్పటికే 20 కోట్లు బిజినెస్ చేసిందని తెలుస్తుండగా డిజిటల్ రైట్స్ రూపంలో 15 కోట్ల దాకా రాబట్టిందట. అమేజాన్ ప్రైం ఎన్.టి.ఆర్ డిజిటల్ రైట్స్ సొంతం చేసుకుందట. 15 కోట్ల దాకా రేటు పలికిందని తెలుస్తుంది. అమేజాన్ ప్రైం భారీ రేటుతో ఈ సినిమా కొనేందుకు ముందుకొచ్చారు. క్రిష్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా అంచనాలను అందుకునేలా ఉంటుందా లేదా అన్నది సినిమా వస్తేనే కాని చెప్పగలం.