తెర చూసే సమయాన్ని తగ్గించేద్దాం..!

SMTV Desk 2018-05-11 12:49:12  cellphone avoid tips, internet using, hyderabad, social media,

హైదరాబాద్, మే 10 : ఇంటర్ నెట్ ఇప్పుడు ప్రతిఒక్కరికి అలవాటుగా మారిపోయింది. చాలా మంది స్మార్ట్ ఫోన్ లో వీపరితంగా నెట్ సర్ఫింగ్ చేసేస్తున్నారు. ఎంతలా అంటే.. సామాజిక మాధ్యమాల కోసం ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తున్నారు. వారంలో అప్పుడప్పుడు అంతర్జాలం కోసం సమయాన్ని తగ్గించాలి అనుకుంటాం. కానీ అలవాటు మాత్రం అలానే కొనసాగుతుంది. తెర చూసే సమయాన్ని తగ్గించేందుకు కొన్ని సలహాలు.. >> మనం ఏ ఉద్యోగంలో ఉన్నాసరే.. అంతర్జాలం చూడక తప్పనిసరి పరిస్థితి! అదిపోగా, మీ వ్యక్తిగత సమయంలో స్మార్ట్‌ఫోన్‌ వాడకాన్ని భారీగా తగ్గించడానికే ప్రయత్నించండి. >> ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటివి మన సమయాన్ని వృధా చేస్తున్నాయి. వీటిని నియంత్రించే యాప్ లు కూడా ఉన్నాయి. మీరు వీటిలో అత్యధికంగా సమయాన్ని కేటాయిస్తే అప్పటికప్పుడు హెచ్చరించి.. వాటిని ఆఫ్‌ చేయడానికి రిస్క్‌ టైమ్‌, యాప్‌ డిటాక్స్‌ వంటి యాప్‌లు వంటివి ఉపయోగపడతాయి. >> స్మార్ట్‌ఫోన్‌ కాకుండా అంతర్జాల సౌకర్యం లేని మామూలువాటిని కొన్నిరోజుల పాటు వాడండి. రెండురోజుల నుంచి మొదలుపెట్టి రెండువారాలదాకా ఉండగలరేమో చూడండి. >> ఉదయం మేల్కోవడానికి కొంతకాలంపాటు సెల్‌ఫోన్‌ బదులు మామూలు గడియారం అలారం ఉపయోగించడం అలవాటు చేసుకోండి. మనలో చాలామంది నిద్రలేచిన ఐదు నిమిషాల్లోపు స్మార్ట్‌ఫోన్‌లు చూడటానికి ప్రధాన కారణాల్లో ఈ అలారం వాడకం కూడా ఒకటి మరి!