వాటిని కూడా శుభ్రం చేయండి..!

SMTV Desk 2018-05-09 18:25:19  bed and pillows cleaning, tips of beds and clothes, hyyderabad, clothes and bed s and pillows

హైదరాబాద్, మే 9 : ఇంట్లో ఉండే ప్రతి ప్రదేశాన్ని చాలా శుభ్రంగా ఉంచుతాము. దుస్తులు ఒక్కసారి వేసుకోగానే ఉతికి ఆరేస్తాం. మరి మనం నిద్రించే పరుపులని ఎన్ని రోజులకు శుభ్రం చేయాలి? అవనే కాదు మన ఇంట్లో వాడే వస్తువుల్ని ఎప్పుడెప్పుడు శుభ్రం చేయాలో తెలుసుకుందాం. >> ముందుగా మనం నిత్యం ఉపయోగించే దుప్పట్లు సాధారణంగా... మాసిపోయాయి అనుకుంటే వాటిని ఉతుకుతాం. కానీ ఉబ్బసం, ఎలర్జీ వంటి సమస్యలు ఉండేవారికి దుప్పట్లలోని డస్ట్‌మైట్స్‌ ఆ సమస్యల్ని తీవ్రతరం చేస్తాయి. అందుకని ఈ సమస్యలున్నవారు ప్రతివారానికోసారి దుప్పట్లని ఉతికేస్తూ ఉండాలి. అది కూడా వేడివేడి నీళ్లతో ఉతికి ఎండలో ఆరేయాలి. >> జీన్స్‌ కదా ఉతకడం కష్టం అని చెప్పి... ఓ పదిసార్లు వేసుకున్న తర్వాత నానబెట్టకండి. రెండూ లేదా మూడు సార్లు వేసుకున్న తర్వాత చన్నీళ్లతో ఉతికేస్తే మంచిది. >> గలేబులని అయితే తరచూ ఉతుకుతాం. కానీ దిండ్లని మాత్రం ఉతకం. పైన కవరు మార్చాంగా అనుకుంటాం. కానీ వీటల్లో డస్ట్‌మైట్లు పేరుకుని అనేక అలర్జీలు రావడానికి కారణమవుతాయి. అందుకని నెలకోసారయినా ఉతకాలి. అయితే బాగా గట్టిగా పిండేయకూడదు. నెమ్మదిగా పిండి ఎండలో పెట్టేస్తే సరిపోతుంది. >> పరుపులు నల్లగా అయిపోయినా అలానే వాడేస్తున్నారా? అది మంచి పద్ధతి కాదు.. ప్రతి ఆరునెలలకోసారి వ్యాక్యూమ్‌ క్లీనర్‌తో శుభ్రం చేయాలి. దుమ్ము పోతుంది. అలాగే ఎండలోపెట్టి... షాంపూ ముంచిన వస్త్రంతో మరకలు ఉంటే తుడిచేయండి. >> కార్పెట్లని సంవత్సరాలు తరబడి అలానే వదలకుండా.. కనీసం ఏడాదికి ఒకసారైన వ్యాక్యూమ్‌ క్లీనర్‌తో శుభ్రం చేస్తే అది అలర్జీ కారకాలతో నిండకుండా ఉంటుంది.