క్యూబా అధ్యక్షుడిగా డియాజ్‌ కానెల్‌

SMTV Desk 2018-04-20 12:30:59  Miguel Diaz-Canel, cuba new president, cuba, hawana

హవానా, ఏప్రిల్ 20 : క్యూబా నూతన అధ్యక్షుడిగా కమ్యూనిస్ట్‌ అగ్రనేత మిగ్వెల్‌ డియాజ్‌ కానెల్‌(58) ఎన్నికయ్యారు. దీంతో కమ్యూనిస్టు పాలనలో ఉన్న లాటిన్‌ అమెరికా దేశం క్యూబాలో క్యాస్ట్రోల ఆరు దశాబ్దాల పాలనకు గురువారం తెరపడింది. బుధవారం ఆయన్ని జాతీయ అసెంబ్లీ ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నుకుంది. ప్రస్తుత అధ్యక్షుడు రౌల్‌ క్యాస్ట్రో స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. క్యాస్ట్రో కుటుంబేతర వ్యక్తి ఈ పదవికి ఎన్నికవడం ఆరు దశాబ్దాల కాలంలో ఇదే తొలిసారి. కానెల్‌ 2013 నుంచి క్యూబాకు తొలి ఉపాధ్యక్షుడిగా పనిచేశారు.