నెల్సన్‌ మండేలా మాజీ సతీమణి కన్నుమూత

SMTV Desk 2018-04-03 11:08:15  Nelson mandela, wife died, Johannesberg

కేప్‌టౌన్, ఏప్రిల్ 3‌: నెల్సన్‌ మండేలా మాజీ సతీమణి విన్నీ మండేలా ఇకలేరు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆస్పత్రిలో సోమవారం తుదిశ్వాస విడిచినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. విన్నీ.. దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్‌ మండేలా మాజీ భార్య. జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమంలో మండేలా 27 ఏళ్ల పాటు జైలు జీవితం గడిపినప్పుడు, అతని విడుదల కోసం ఉద్యమించటంతో పాటు, నల్ల జాతీయుల హక్కుల కోసం విన్నీ పోరాడారు. మండేలాని పెళ్లి చేసుకోకముందే సామాజిక కార్యకర్త అయిన విన్నీ, తన వైవాహిక జీవితంలో మండేలాకు ఎంతగానో తోడ్పాటు అందించారు. 38 ఏళ్లు మండేలాతో వివాహా బంధం కొనసాగించిన విన్నీ 1996లో విడాకులు తీసుకున్నారు. మండేలా, విన్నీలకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విన్నీ అంత్యక్రియలు ఎప్పుడు, ఎక్కడ నిర్వహిస్తారనే సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.