ఆఫ్రికా ఖండం రెండుగా విడిపోనుందా..!

SMTV Desk 2018-04-01 17:11:51  africa continent, africa split into two, kenya, Nairobi

ఆఫ్రికా, ఏప్రిల్ 1: ప్రపంచంలో రెండో అతి పెద్ద ఖండంగా పేరుగాంచిన ఆఫ్రికా రెండుగా విడిపోనుందా..! ప్రస్తుతం ఆఫ్రికా ప్రజలను భయపెడుతున్న అతిపెద్ద ప్రశ్న ఇది. కెన్యా రాజధాని నైరోబికి సమీపంలో గల హైవేపై ఏర్పడిన పగులు ఈ ఆందోళనలకు కేంద్ర బిందువు గా నిలిచింది. టెక్టోనిక్‌ ప్లేట్లలో నైరుబీ వద్ద వస్తున్న కదలికలు ఆఫ్రికా రెండుగా విడిపోతుందనే నమ్మకాన్నిబలపరుస్తున్నాయి. నైరుతీ కెన్యాలో గల రిఫ్ట్‌ లోయ వద్ద భారీ పగులు ఏర్పడింది. కొన్ని మైళ్ల పాటు విస్తరించిన ఈ పగులు కారణంగా నైరోబీ-నరోక్‌ హైవే కూడా పాక్షికంగా దెబ్బతింది. ఈ పగులు కారణంగా భవిష్యత్‌లో ఆఫ్రికా రెండు ముక్కలు అవుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అయితే ఇందుకు కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుందని వెల్లడించారు. ప్రభుత్వ అధికారులు అక్కడ ఏమైనా రోడ్డు పనులు చేపడితే ఒకటికి వంద సార్లు పరీక్షలు చేసి చేపట్టాలని శాస్త్రవేత్తలు తెలిపారు.