హాంకాంగ్‌లో ఆగని ఆందోళనలు

SMTV Desk 2019-10-21 19:01:03  

హాంకాంగ్ : కమ్యూనిస్టు పాలకుల విధానాలను నిరసిస్తూ నిజమైన ప్రజాస్మామ్యం కావాలని నినదిస్తూ గత ఇరవై వారాలుగా సాగుతున్న ఆందోళనలు రానురాను తీవ్రమవుతున్నాయి. ఎవరూ నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు సాగించరాదని పాలక వర్గం ఆంక్షలు విధించినా ఎవ రూ ఖాతరు చేయడం లేదు. ఆదివారం వేలాది మంది ఆందోళన కారులు రోడ్లపై కదం తొక్కా రు. ఇటీవల ప్రజాస్వామ్య వాదులైన ఇద్దరు ఆందోళన కారుల్లో ఒకరికి కత్తిపోట్లు, మరొకరిపై దాడి జరగడం ఆందోళనను మరింత ఉద్దృ తం చేసింది. వాణిజ్య కూడళ్లపై షాపులు ధ్వంసం చేశారు. పెట్రోలు బాంబులు విసరడం ప్రారంఢించారు. ఈ నిరసన ప్రదర్శనలు, ర్యాలీ లు నిషేధించినా సాగుతుండడంపై పోలీసులు విరుచుకు పడ్డారు. ఆందోళన కారులను చెదర గొట్టడానికి జలఫిరంగులు, భాష్పవాయువులు ప్రయోగించారు.

అయినా ఆందోళన కారులు వెనక్కు తగ్గలేదు. ర్యాలీ భారీ ఎత్తున మొదట ప్రశాంతంగా ప్రారంభమైనా చివరికి ఉద్ధృతం గా మారింది. పోలీస్, సబ్‌వే ప్రవేశ మార్గాల వద్ద బ్యాంకు బ్రాంచిలను, అనేక దుకాణాలను ధ్వంసం చేశారు. మధ్యాహ్నం అంతా జలఫిరంగుల( వాటర్ క్యానన్ ) ట్రక్కు ఆందోళన కారులను వెంటతరుముతూనే ఉంది. అనేక సార్లు పోలీసులు భాష్పవాయువు, రబ్బరు బులెట్ ప్రయోగాలు, లాఠీ ఛార్జీలు చేయవలసి వచ్చింది. వీధుల్లోకి ఆందోళన కారులు భారీగా తరలిరావడంతో వారి వెనుక నాయకులు బారికేడ్లను తగుల బెట్టి పోలీసులను అడ్డుకున్నారు.

శనివారం నాడు ఆందోళన కారుడు ఒకరిని పాలకవర్గాల మద్దతు దారుడు కత్తితో పొడవడం సంచలనం కలిగించింది. వీకెండ్ ర్యాలీకి నాయకత్వం వహించే జిమ్మీ షామ్‌ను ఈ వారం మొదట్లో కొందరు సమ్మెటలతో దాడులు చేసి తీవ్రంగా గాయపరిచారు. ప్రస్తుతం జిమ్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అధికార వర్గాలు తమ ఉద్యమాన్ని అణచివేయడానికి ఎంత ప్రయత్నించినా ఆందోళనలపై నిషేధం విధించినా తాము లొంగేది లేదని, పూర్తి ప్రజాస్వామ్యం సిద్ధించే వరకు తాము ఆందోళనలు కొనసాగిస్తామని ఆందోళన కారులు హెచ్చరించారు.