జగన్ ఆర్టీసీ ని ప్రభుత్వం లో విలీనం చేసి మంచి పని చేసాడు

SMTV Desk 2019-10-19 14:40:42  

తెలంగాణ బంద్ నేపథ్యం లో అరెస్టుల పర్వం మొదలయ్యింది. తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న ఆర్టీసీ సమ్మె 15 వ రోజుకి చేరింది. ప్రతి పక్ష పార్టీలు, ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు సమ్మెకు సంపూర్ణ మద్దతు ని తెలుపుతున్నాయి. అయితే ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా వచ్చిన కోదండరాం, పార్టీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని కోదండరాం డిమాండ్ చేసారు. పోలీసులు టీడీపీ నేతలైన ఎల్. రమణ, రావుల చంద్ర శేఖర్ రెడ్డి, మోత్కుపల్లి నరసింహులని అరెస్ట్ చేసారు.

మాజీ టీడీపీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నరసింహులు మీడియా తో మాట్లాడుతూ, ఆర్టీసీ సమ్మెకు తమ మద్దతు ఉందని ప్రకటించారు. సీఎం కేసీఆర్ రాష్ట్రానికి తండ్రి లాంటి వాడని, ముఖ్యమంత్రి గద్దె దిగి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని అన్నారు. హైకోర్టు చురకలంటించినా కేసీఆర్ తీరు మారడం లేదని, చాల బాధాకరం అని అన్నారు. ఈ మధ్యలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆర్టీసీ ని ప్రభుత్వం లో విలీనం చేసిన విషయాల్ని గుర్తు చేసారు. ఆర్టీసీ ని ప్రభుత్వం లో విలీనం చేసి జగన్ మోహన్ రెడ్డి మంచి పని చేసారని అన్నారు.