భార్యను వెళ్లగొట్టిన ఎన్నారైకి షాక్

SMTV Desk 2019-10-15 11:22:12  

పెళ్లయిన రెండేళ్లకే భార్యను హింసించి పుట్టింటికి పంపించేసిన ఓ ఎన్నారైకి ముంబై కోర్టు షాకిచ్చింది. అతను ఆమెకు ఖర్చుల నిమిత్తం నెలకు 15 వేల నుంచి 30 వేల వరకు ఇవ్వాలని ఆదేశించింది. ఈ తీర్పును అమెరికాకు చెందిన ఐటీ ఉద్యోగి మహమ్మద్ జుబెర్ ఫరూఖీ సవాలు చేస్తూ బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించిన హైకోర్టు.. జుబెర్‌దే తప్పనే అభిప్రాయం వ్యక్తం చేసింది. దాంతో కింది కోర్టు ఇచ్చిన తీర్పును బలపరిచింది. జుబెర్ నాలుగువారాల్లోపు బాధితురాలికి సొమ్ము చెల్లించాలని జస్టిస్ ఎస్ ఎస్ షిండే నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టంచేసింది. లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

ముంబైకి చెందిన ఓ యువతిని 2008లో పెళ్లాడిన జుబెర్.. ఆమెను తనతోపాటు యూఎస్ తీసుకెళ్లాడు. ఆ తర్వాత కొన్ని రోజులకే తనలోని రాక్షసుడిని బయటపెట్టాడు. భార్యను హింసించడం, కొట్టడం చేసేవాడు. వాటన్నింటినీ భరిస్తూ వచ్చిన భార్యను చివరకు మెడపట్టుకొని ఇంట్లోంచి గెంటేశాడు. దీంతో ఎటుపోవాలో తోచని ఆమె.. తెలిసిన వారి సాయంతో భారత్‌లోని పుట్టింటికి చేరింది. ఇక్కడకు చేరిన తర్వాత భర్తపై గృహహింస కేసు వేసింది.