ట్విట్టర్ పిట్ట ఆగిపోయింది ..

SMTV Desk 2019-10-02 15:27:27  

ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్విట్టర్ సేవలకు బ్రేక్ ఏర్పడింది. ఈ ఉదయం నుంచి ట్విట్టర్ కు అంతరాయం కలిగింది . లాగిన్ అయితే ఎర్రర్ మెసేజ్ వస్తోంది. దీనిపై ట్విట్టర్ నుంచి వివరణ వచ్చింది. లోపం ఎక్కడుందో కనుక్కుని, దాన్ని పరిష్కరించే పనిలో తమ నిపుణులు తలమునకలై ఉన్నారని, త్వరలోనే సాధారణ స్థితి నెలకొంటుందని ఆ సంస్థ వర్గాలు పేర్కొన్నాయి. ట్విట్టర్ అకౌంట్లో లాగిన్ కాలేకపోతున్నామంటూ ప్రపంచవ్యాప్తంగా 4000కి పైగా రిపోర్టులు ట్విట్టర్ వర్గాలను చిన్నాభిన్నం చేశాయి. ముఖ్యంగా, జపాన్, కెనడా, భారత్ నుంచి ఎక్కువ ఫిర్యాదులు వెళ్లినట్టు తెలుస్తోంది.