రోహిత్-మయాంక్...రికార్డ్ బ్రేకులు!

SMTV Desk 2019-10-02 15:24:11  

విశాఖపట్నం వేదికగా బుధవారం దక్షిణాఫ్రికాతో ప్రారంభమైన తొలిటెస్టులో ఓపెనర్లు చెలరేగారు. సుదీర్ఘ ఫార్మాట్లో తొలిసారి ఓపెనింగ్‌ చేస్తున్న రోహిత్‌ శర్మ అద్భుతమైన శతకంతో ఆకట్టుకోగా, మరో ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ స్పిన్నర్లపై దూకుడు ప్రదర్శిస్తున్నాడు. వీరిద్దరూ భారత్‌ తరఫున కొన్ని రికార్డులను బద్దలు కొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో 100+ ఓపెనింగ్‌ భాగస్వామ్యం అందించిన భారత ఏడో జోడీగా మయాంక్, రోహిత్‌ నిలిచారు. అంతకుముందు ఎవరెవరు చేశారంటే..ఏ మన్కడ్‌-ఫరూక్‌ ఇంజినీర్‌ ఆసీస్‌పై 1969/70లో 111 పరుగులు చేశారుసునిల్‌ గావస్కర్‌ -అరుణ్‌ లాల్‌ శ్రీలంకపై 1982లో 156 పరుగులు చేశారు.. వీరేంద్ర సెహ్వాగ్‌ - రాహుల్‌ ద్రవిడ్‌ పాక్‌పై 2005/06లో 410 పరుగులు సాధించారు.వసీమ్‌ జాఫర్‌ - దినేశ్‌ కార్తీక్‌ దక్షిణాఫ్రికాపై 2006/07లో 153 పరుగులు చేశారు.మురళీ విజయ్‌ - శిఖర్ ధావన్‌ ఆస్ట్రేలియాపై 2012/13లో 289 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.కేఎల్‌ రాహుల్‌ - పార్థివ్‌ పటేల్‌ ఇంగ్లాండ్‌పై 2016/17లో 152 పరుగులు చేశారు.మయాంక్‌ అగర్వాల్‌ - రోహిత్‌ శర్మ దక్షిణాఫ్రికాపై 2019/20లో 100* చేశారు. సెంచూరియన్‌లో దక్షిణాఫ్రికాపై సెహ్వాగ్‌, గంభీర్‌ 2010లో 137 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత సఫారీలపై భారత్‌కు ఇదే తొలి 100+ ఓపెనింగ్‌ భాగస్వామ్యం కావడం గమనార్హం. మయాంక్‌ అగర్వాల్‌ మరో రికార్డు బద్దలు కొట్టాడు. భారత్‌ తరఫున సొంతగడ్డపై, విదేశాల్లో అరంగేట్రంలో 50+ స్కోర్లు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అంతకు ముందు రుసి మోదీ, సురిందర్‌ అమర్‌నాథ్‌, అరుణ్‌ లాల్‌, సౌరవ్‌ గంగూలీ, సురేశ్‌ రైనా, హార్దిక్‌ పాండ్య ఈ ఘనత సాధించారు. ఇక భారత గడ్డపై వరుసగా ఆరు టెస్టు ఇన్నింగ్సుల్లో 50+ స్కోర్లు చేసిన నాలుగో ఆటగాడిగా హిట్‌మ్యాన్‌ అవతరించాడు. అంతకు ముందు ఎవర్టన్‌ వీక్స్‌ (1948 నవబర్‌- 1949 ఫిబ్రవరి), రాహుల్‌ ద్రవిడ్‌ (1997 నవంబర్‌ - 1998 మార్చి), ఆండీ ఫ్లవర్‌ (1993 మార్చి - 2000 నవంబర్‌) ఈ ఘనత సాధించారు. 2016 సెప్టెంబర్‌ నుంచి రోహిత్‌ ఈ ఒరవడి సాగిస్తున్నాడు.