బెజవాడలో సేఫ్టి డ్రైవింగ్‌ ఎడ్యుకేషన్‌ సెంటర్‌

SMTV Desk 2019-09-26 17:57:16  

విజయవాడలో రవాణ శాఖ, హోండా మోటార్‌ సైకిల్‌ అండ్‌ స్కూటర్స్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సేఫ్టి డ్రైవింగ్‌ ఎడ్యుకేషన్‌ సెంటర్‌ను ఈరోజు రవాణ శాఖ మంత్రి పేర్ని నాని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, రవాణా శాఖ కమిషనర్‌ సీతారామాంజనేయులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ... ఈ సేఫ్టి డ్రైవింగ్‌ ఎడ్యుకేషన్‌ సెంటర్‌లో ప్రతి రోజు సురక్షిత ప్రయాణం ఎలా అనే అంశంపై శిక్షణ ఇస్తారనీ, రోజుకి వంద మందికి శిక్షణ ఇస్తారనీ, ఈ క్లాసులన్ని ఉచితంగా అందిస్తామని, అందరూ సద్వినియోగం​ చేసుకోవాలని ఆయన సూచించారు. ట్రైనింగ్‌ తీసుకోకుండా ఎవరికి లర్నింగ్‌ లైసెన్స్‌ ఇవ్వటానికి వీల్లేదని తేల్చి చెపుతూ, చివరకు తన కొడుకు అయినా సరే కోచింగ్‌ తీసుకున్న తర్వాత మాత్రమే ఎల్‌ఎల్‌ఆర్‌ తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇదే కార్యక్రమంలోనే ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ ప్రమాదాలు నివారించడానికి, ప్రాణాలు కాపాడటానికి ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుందనీ, జగన్‌మోహన్‌రెడ్డి తీసుకువస్తున్న సంస్కరణ పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.