తేలు విషంతో క్షయ వ్యాధి నివారణ!

SMTV Desk 2019-06-13 16:05:03  scorpion poison cures of tb disease

న్యూయార్క్: నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ మెక్సికో, స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీ పరిశోధకులు ఓ నూతన ఔషధాన్ని కనుగొన్నారు. తేలు విషంలో క్షయ వ్యాధిని నయం చేయగల రెండు రంగులు మారే కాంపౌండ్‌లను వారు తాజాగా కనుగొన్నారు. ఈ కాంపౌండ్‌లు బ్యాక్టీరియా వల్ల వచ్చే క్షయ వ్యాధి వంటి వ్యాధులతో పోరాడ గలుగుతాయి. డిప్లోసెంట్రస్ మెలిసి అనే విషపూరిత తేలు నుంచి కాంపౌండ్‌లను వేరు చేసి పరిశోధించారు. ఈ రకం తేళ్లు తూర్పు మెక్సికో లో కనిపిస్తాయి. క్షయవ్యాధిని నివారంచే మందులను ప్రతిఘటించే స్టెఫిలోకాకస్ బ్యాక్టీరియాను ఈ తేలు విషం కాంపౌండ్లు నాశనం చేస్తాయని ఎలుకల్లో జరిపిన పరిశోధనలో తెలుసుకున్నారు.