మరో ఎన్నికల కల రాబోతుంది

SMTV Desk 2019-06-11 17:56:23  elections,

తెలంగాణ రాష్ట్రంలో మరో ఎన్నికల కల రాబోతుంది. తెలంగాణాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తరువాత పంచాయితీ, స్థానిక ఎన్నికలు ఇలా వరుసగా జరిగాయి… కాగా తెలంగాణాలో 32 జిల్లా పరిషత్ లో దాదాపుగా అన్ని స్థానాలను కైవసం చేసుకొని తెలంగాణాలో తెరాస కి మళ్ళీ ఎదురే లేదని నిరూపించుకుంది. కాగా ఇదే ఊపులో మున్సిపల్ ఎన్నికలను కూడా పూర్తి చేద్దామని తెరాస భావిస్తుంది. కాగా మున్సిపల్ ఎన్నికల్లో కూడా అన్ని స్థానాల్లో గెలుపొందానికి తెరాస ప్రయత్నిస్తుంది. అందుకోసమని తగిన ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకుంటున్నారు. ప్రస్తుతానికి తెలంగాణాలో తెరాస హావ తప్ప వేరే ఏ పార్టీ పేరు కూడా సరిగా వినిపించడం లేదు. అందుకని ఈ సమయంలోనే మున్సిపల్ ఎన్నికలు జరిగితే విజయం ఖాయమని తెరాస అంచనా వేస్తుంది. అయితే ఈ ఎన్నికలకు మారిన్నీ రోజులు సమయం పట్టేలా ఉందని ఆలోచన చేసిన నేతలు త్వరగా పనులు జరిపేలా రంగం సిద్ధం చేసుకుంటుంది.

కాగా రెండవసారి అధికారంలోకి వచ్చిన తెరాస పార్టీలో కెసిఆర్ వ్యవహార శైలి సరిగా లేదని, ఇంకా మంత్రివర్గ విస్తరణ కూడా సరిగా చేయలేదని, మంత్రి వర్గంలో వివిధ శాఖలు ఖాళీగా ఉండటం వలన పలు సమస్యలు వస్తున్నాయని, తాజాగా ఇలాగె రైతుల సమస్యలు తెరమీదకు వచ్చాయని తెలుస్తుంది. అయితే ఈ మున్సిపల్ ఎన్నికలు కూడా సకాలంలో పూర్తి చేసి , ఇక మంత్రివర్గాన్ని పూర్తీ స్థాయిలో విస్తరించాలని కెసిఆర్ నిర్ణయించుకున్నరునై, అందుకనే ఈ ఎన్నికలను తెరమీదకు తెచ్చారని సమాచారం.