జట్టులో స్థానం కోసం డివిలియర్స్‌ నాకు ఫోన్ చేశాడు: డుప్లిసిస్‌

SMTV Desk 2019-06-11 17:24:09  ab de villiers, faf du plessis

సౌతాంప్టన్‌: సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ ఏబి డివిలియర్స్‌ పోయిన ఏడాది తన రిటైర్మెంట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్ మెగా టోర్నీలో ఆడేందుకు డివిలియర్స్‌ విశ్వప్రయత్నాలు చేసినా కాని ఫలించలేదు టీం యాజమాన్యం ఆయన ప్రతిపాదనను తోసిపుచ్చింది. అయితే ఈ విషయంపై తాజాగా ఆ జట్టు కాప్టెన్ డుప్లిసిస్‌ స్పందించాడు. వర్షం కారణంగా మ్యాచ్‌ రద్దయ్యాక మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించాడు. ప్రపంచకప్‌ జట్టుని ప్రకటించే ముందు రోజు రాత్రి మిత్రుడు డివిలియర్స్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. అవకాశం ఉంటే నాకు ఆడాలని ఉందని చెప్పాడు. అప్పటికే ఆలస్యం కావడంతో సెలక్టర్లతో మాట్లాడి చూస్తానని చెప్పాను. ఆ తర్వాత రోజు తాను వారిని సంప్రదించాక..సమయం గడియిపోయిందని ఇప్పుడు డివిలియర్స్‌ను చేర్చుకోవడం అసాధ్యమని తెలిపారు అని పేర్కొన్నాడు. ఐతే ఈ విషయం వల్ల తమ స్నేహానికి ఇబ్బంది కలగకూడదని ఇదొక చిన్న విషయాన్ని వెల్లడి చేశాడు