లండన్: ఓ భారతీయుడు లండన్ లో ఓ యువతిపై అత్యాచారం చేసి భారత్ కు వచ్చిన అతనికి న్యాయస్థానం ఏడేళ్ళు జైలు శిక్ష విధించింది. ఈ ఘటన పూర్తి వివరాల ప్రకారం...అజయ్ రానా అనే యువకుడు తూర్పు లండన్ సఫోల్క్ ప్రాంతంలో డిసెంబరు 9, 2017న స్పేహితుడు కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఒక మహిళకు లిఫ్ట్ ఇచ్చాడు. కొద్దిదూరం ప్రయాణించిన తర్వాత కారు పక్కకు ఆపి మహిళను కారులోనే అత్యాచారానికి పాల్పడ్డాడు. అతని నుంచి తప్పించుకుని తన స్నేహితులకు జరిగిన విషయం చెప్పింది. వారు పోలీసులకు సమాచారం అందించి ఫిర్యాదు చేశారు. కారు ప్రయాణించిన మార్గంలోని సిసి టివి ఫేటేజిని పరిశీలించిన పోలీసులు కారు యజమానిని గుర్తించారు. ఆయనను ఎంక్వైరి చేయగా నిందితుడు అతని రూమ్‌మేట్ అని ఇండియాకు మూడు రోజుల క్రితం వెళ్లాడని చెప్పాడు. అతను వాడే ఇయర్‌ఫోన్స్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపాపారు. బాధితురాలి వైద్య రిపోర్టులు…నిందితుని డిఎన్‌ఏ రిపోర్టులు సరిపోలాయి. యూకే పోలీసులు అరెస్టు వారెంట్ జారీ చేశారు. యూరోపియన్ అరెస్టు వారెంట్‌పై నిర్భంధంలోకి తీసుకుని నవంబరులో యూకెకు తరలించారు. విచారణలో అతడు దోషిగా తేలడంతో కోర్టు ఏడేళ్ల కారాగార శిక్ష విధించింది.