ఎల్‌జీ కంపెనీ తాజాగా ఎల్‌జీ ఓఎల్ఈడీ88జెడ్9 పేరుతో మరో సరికొత్త టీవీని మార్కెట్లోకి తీసుకొచ్చింది. ప్రపంచంలో కస్టమర్ల ముందుకు రాబోతోన్న తొలి 8కే ఓఎల్ఈడీ టీవీ ఇదే. LG 8K TVలో 88 అంగుళాల డిస్‌ప్లే ఉంటుంది. దక్షిణ కొరియాలో ఈ టీవీల కోసం ప్రిఆర్డర్లు కూడా ప్రారంభమయ్యాయి. 2019 మూడో త్రైమాసికంలో కంపెనీ ఈ టీవీలను ఉత్తర అమెరికా, యూరప్ దేశాల్లో అందుబాటులోకి తీసుకురానుంది. ఈ టీవీ ధర ఎంతో తెలియాల్సి ఉంది. అయితే ధర 42,000 డాలర్లుగా ఉండొచ్చని అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది. మన కరెన్సీలో టీవీ ధర దాదాపు రూ.29.4 లక్షలు. ఇకపోతే World s first 8K OLED TV ఇదే కావడం గమనార్హం. ఇది స్మార్ట్ టీవీ కూడా. 4కే టీవీతో పోలిస్తే ఇందులో పిక్చర్ 4 రెట్లు షార్ప్‌గా కనిపిస్తుంది. ఫుల్ హెచ్‌డీ టీవీలతో పోలిస్తే 16 రెట్లు షార్ప్‌గా ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్‌లో 8కే కంటెంట్ చాలా తక్కువగా అందుబాటులో ఉంది.