గురుగ్రామ్: దేశీయ ఫుడ్ డెలివరీ స్టార్టప్ స్విగ్గీ కొత్త ఆలోచనలతో వినియోగదారులను మరింత చేరువ అయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ఇంటి వాతావారణంలో తయారు చేసిన భోజనం డెలివరీ చేసేందుకు ‘స్విగ్గీ డైలీ’ పేరిట కొత్త యాప్‌ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం గురుగ్రామ్‌లో ప్రారంభించిన ఈ ‘స్విగ్గీ డైలీ’ సేవలు త్వరలోనే బెంగళూరు, ముంబై నగరాలకు విస్తరించనున్నట్లు సంస్థ తెలిపింది. ఈ యాప్‌లో ఎప్పుడుకావాలంటే అప్పుడు ముందస్తుగానే ఆర్డర్ షెడ్యూల్ చేసుకోవచ్చు. అంతేకాకుండా వారం లేదా నెలసరి చందా చెల్లించి ఆర్డర్ చేసుకొనే విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.