ఐస్ హాకీ ఆడుతూ... కింద పడిపోయిన రష్యా అధ్యక్షుడు పుతిన్..

SMTV Desk 2019-05-24 16:42:16  putin, rashya,

రాజకీయాల్లోనే కాదు క్రీడల్లో కూడా ఎప్పుడు యాక్టీవ్‌ గా ఉండే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అప్పుడప్పుడూ ప్రజల ముందుకు వస్తుంటారు. తాజాగా సోచీలో జరిగిన ఐస్ హాకీ ఎగ్జిబిషన్ గేమ్ లో పాల్గొన్న పుతిన్‌ .. మ్యాచ్‌ లో 8 గోల్స్‌ కొట్టి అందరిని షాక్‌ కి గురి చేశారు. ఫుల్‌ జోష్‌ తో గోల్స్‌ చేసిన ఆయన ఒక్కసారిగా అదుపుతప్పి కింద పడిపోయారు. దీంతో పక్కనే ఉన్న సిబ్బంది పైకిలేపడంతో.. వెంటనే పుతిన్‌ నవ్వుతూ ప్రేక్షకులకు చేతులు ఊపుతూ అభివాదం చేస్తూ ఆట కొనసాగించారు.