18 ఏళ్ల బాలికని ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడిన బంధువు

SMTV Desk 2019-05-10 16:32:41  girl raped, relatives raped, girl missing

ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోని ఆగ్రాకు చెందిన 18 ఏళ్ల బాలికపై ఆమె సమీప బంధువు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితురాలు పొదల్లో అపస్మారకస్థితిలో ఉండడాన్ని చూసిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన ఆగ్రాకు సమీపంలోని పోహియా గ్రామంలో చోటు చేసుకొంది. బాలికపై అత్యాచారానికి పాల్పడింది ఆమె సమీప బంధువుగా గుర్తించారు.బాధితురాలు తన తల్లితో కలిసి ఓ పెళ్లికి హాజరైంది.

అయితే ఆమెను నిందితుడు ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. రెండు గంటలైనా కూడ తన కూతురు రాలేదని బాధితురాలు ఆ ప్రాంతంలో వెతికింది. అయితే సమీపంలోని పొదల్లో బాధితురాలు అపస్మాకరస్థితిలో పడి కన్పించింది.నిందితుడిపై కేసు నమోదు చేసుకొని పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలిని పరీక్షల నిమిత్తం పోలీసులు ఆసుపత్రికి తరలించారు.