చైనాలో పబ్ జి బ్యాన్!

SMTV Desk 2019-05-08 17:39:51  china, pubg game banned in china

బీజింగ్: పబ్ జి గేమ్ ను దాని తాయారు చేసిన సంస్థ టెన్సెంట్ హోల్డింగ్స్ లిమిటెడ్ చైనాలో మూసేసింది. ఆ దేశంలో ఉన్న పబ్ జి యూజర్లందరిని దేశభక్తి ఉన్న వీడియో గేమ్ కి మార్చేసింది. పబ్ జి మాదిరి కాకుండా ఈ వీడియో గేమ్ కి రెవెన్యూ సాధించుకొనేందుకు నియంత్రణ అనుమతులు లభించాయి. చైనాకు చెందిన వీడియో గేమ్ తయారీ సంస్థ దాదాపు ఏడాదికి పైగా పబ్ జి ద్వారా ఆదాయం ఆర్జించేందుకు అనుమతి కోరుతూ వేచి చూసింది. కానీ ఎంతకూ అనుమతులు రాకపోవడంతో కఠినమైన ప్రభుత్వ నియమాలకు అనుగుణంగా ఉండేందుకు దక్షిణ కొరియా తయారీ అయిన ఆటకు సోషలిస్ట్ హంగులద్ది కొత్తగా ప్రవేశపెడుతోంది.చైనాకి చెందిన ట్విట్టర్ వంటి మైక్రోబ్లాగింగ్ సైట్ వీబో ప్లాట్ ఫామ్ లోని గేమ్ అధికారిక అకౌంట్ లో పెట్టిన పోస్టులో పబ్ జి టెస్టింగ్ ను మూసేస్తున్నట్టు టెన్సెంట్ ప్రకటించింది. దీని స్థానంలో యాంటీ టెర్రరిజమ్ థీమ్ తో రూపొందించిన గేమ్ ఫర్ పీస్ ను ప్రవేశపెట్టినట్టు తెలిపింది. ఈ ఆటకు ఏప్రిల్ లోనే మానిటైజేషన్ అనుమతులు వచ్చేశాయి.