స్వార్ధం కోసం ఎంతో మంది యువ ఆటగాళ్ల కెరీర్‌లను నాశనం చేశాడు: గౌతం

SMTV Desk 2019-05-08 13:29:42  shahid afridi, gautam gambhir

భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్, పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదికి రోజురోజుకి వివాదం వేడెక్కుతోంది. ఇద్దరి మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. షాహిద్ తన ఆటోబయోగ్రఫీ విడుదలైనప్పటి నుంచి ఈ వివాదం మొదలయింది. ఈ బుక్ రిలీజ్ చేస్తున్న సమయంలో గంభీర్ పై సంచలన వ్యాఖ్యలు చేసాడు. అందుకు ధీటుగా గంభీర్‌ కూడా ఘాటుగానే స్పందించాడు. అఫ్రిదీ మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడని.. ఆయన్ను పిచ్చాస్పత్రిలో చూపించాల్సిందే. భారత్‌కు వస్తే స్వయంగా తానే మానసిక నిపుణుడి వద్దకు తీసుకుపోతా అని గంభీర్ అన్నారు. గంభీర్‌తో పాటు జావెద్‌ మియాందాద్‌, వకార్‌ యూనిస్‌ వంటి వారిని కూడా అఫ్రిదీ వివాదాల్లోకి లాగాడు.అఫ్రిదీ వ్యాఖ్యలపై తాజాగా పాక్ మాజీ క్రికెటర్‌ ఇమ్రాన్‌ ఫర్హాత్‌ వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డాడు. షాహిద్‌ అఫ్రిదీ ఆటోబయోగ్రఫీలోని చాలా విషయాలు వాస్తవాలు కాదు. కొన్ని అంశాలు చదివినందుకు నాకు చాలా సిగ్గుగా ఉంది. 20 ఏళ్లపాటు తన వయసుని దాచిపెట్టి ఇతరులను నిందిస్తున్నాడు. ఇది సరైన పద్దతి కాదు అని ఇమ్రాన్‌ తెలిపారు. రాజకీయవేత్త అయ్యేందుకు అఫ్రిదీకి మంచి నైపుణ్యం ఉంది. తన స్వార్ధం కోసం ఎంతో మంది యువ ఆటగాళ్ల కెరీర్‌లను నాశనం చేశాడు. అతడి చేతిలో మోసపోయిన ఆటగాళ్లు తమకు జరిగిన అన్యాయాన్ని వెల్లడించాలి అని ట్విట్టర్ వేదికగా ఇమ్రాన్‌ కోరాడు. ఇమ్రాన్‌ పాక్‌ తరఫున 2001-2013 వరకు 40 టెస్టులు, 58 వన్డేలు, 7 టీ20 మ్యాచులు ఆడాడు.