ఇషాంత్‌ శర్మ కు గుడ్ న్యూస్

SMTV Desk 2019-05-08 12:18:20  Ishanth Sharma, worldcup,

టీమిండియా వెటరన్‌ పేసర్‌ ఇషాంత్‌ శర్మ ఇంతవరకు ఒక్క వరల్డ్‌ కప్‌ లో కూడా ఆడలేదు. ఈ సారి కూడా ప్రపంచకప్‌ టీమ్‌ లో చోటు దక్కించు కోలేకపోయిన లంబూకు కాస్త ఊరట కలగనిచ్చే విషయం బైటికొచ్చింది .ఇంగ్లండ్‌ లో ఈ నెల 30న మొదలయ్యే వరల్డ్‌ కప్‌ లో పాల్గొనే ఇండియా టీమ్‌ కు అతను స్టాండ్‌ బైగా ఎంపికయ్యాడు. రిషబ్‌ పంత్‌ , అంబటి రాయుడు, నవ్‌ దీప్‌ సైనీలతో కలిసి స్టాండ్‌ బై ప్లేయర్‌ గా ఇషాం త్‌ కూడా ఇంగ్లండ్‌ వెళ్లనున్నాడు. ‘సైనీ మా నంబర్‌ వన్‌ రిజర్వ్‌ సీమర్‌ . సెకండ్‌ ఆప్ష న్‌ గా ఇషాం త్‌ ను ఎంచుకున్నాం. అతనికి ఇంగ్లండ్​లో ఆడిన అనుభవం ఉంది.ఇప్పుడు కూడా అతను బాగానే బౌలింగ్‌ చేస్తున్నాడ’ని బీసీసీఐ అధికారి తెలిపారు.