సీబీఎస్ఈ పది ఫలితాలు విడుదల

SMTV Desk 2019-05-06 16:36:21  cbse, tenth results

న్యూఢిల్లీ: సీబీఎస్ఈ నిర్వహించిన పదవ తరగతి పరీక్షల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. cbse.nic.in , cbseresults.nic.in అనే వెబ్‌సైట్ల ద్వారా విద్యార్థులు తమ ఫలితాలను చూసుకోవచ్చు. ఆదివారమే ఫలితాలు ప్రకటిస్తారని వార్తలు వెలువడ్డాయి. సీబీఎస్ఈ అధికారులు దాన్ని తోసిపుచ్చారు.ఆదివారం విడుదల చేయట్లేదంటూ వివరణ ఇచ్చుకున్నారు. హఠాత్తుగా సోమవారం ఫలితాలను ప్రకటించారు. నిర్దేశిత సమయం ప్రకారం.. మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాలు వెలువడాల్సి ఉన్నప్పటికీ.. ముందే ఫలితాలను ప్రకటించారు.