రైల్వే ప్రయాణీకులకు ఐఆర్‌సిటిసి శుభవార్త!

SMTV Desk 2019-05-05 17:39:21  raliway passengers, irctc, Good news for Indian Railways Passengers

న్యూఢిల్లీ: ఐఆర్‌సిటిసి రైల్వే ప్రయాణీకుల కోసం మరిన్ని సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా ప్రయాణికులు తమ బోర్డింగ్ స్టేషన్‌ను మార్చుకునే సేవలు కల్పించింది. ఎవరైనా రిజర్వేషన్ చేసుకున్న తర్వాత ఎక్కే స్టేషన్ మార్చుకోవాలంటే కనీసం 24 గంటల సమయం పడుతోంది. ఒకవేళ బోర్డింగ్ స్టేషన్‌లో ప్రయాణికులు రైలు మిస్సైన రిజర్వేషన్ క్యాన్సిల్ అవుతోంది. ఇలాంటి సందర్భాల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎవరైనా ప్రయాణికులు ముందుగా రిజర్వేషన్ చేసుకున్న తరువాత బోర్డింగ్ స్టేషన్ లో కాకుండా మరోచోట ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు బోర్డింగ్ స్టేషన్ మరోచోటుకి మార్చుకునే సౌలభ్యాన్ని తాజాగా ఐఆర్‌సిటిసి అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే, ఈ సౌకర్యం ఆన్ లైన్ లో టిక్కెట్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీని కోసం ఐఆర్‌సిటిసిలో వెబ్ సైట్‌లో ఐడి పాస్ వార్డ్ లాగిన్ కావాలి. అనంతరం బుకింగ్ టికెట్ హిస్టరీలోకి వెళ్లి, రైలును ఎంచుకొని బోర్డింగ్ పాయింట్ మార్చుకుంటే సరిపోతుంది.