మార్కెట్లోకొచ్చిన వివో ఎస్‌1ప్రొ

SMTV Desk 2019-05-05 17:25:50  vivo, vivo s1 pro

స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వివో త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ వివో ఎస్‌1ప్రొ ను తాజాగా చైనాలో రిలీజ్ చేసింది. ఈ నెల 9వ తేదీ నుంచి ఈ ఫోన్ రూ.27,700 ప్రారంభ ధ‌ర‌కు ల‌భ్యం కానుంది. ఈ ఫోన్ ప్రత్యేకతలు 6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ సూప‌ర్ అమోలెడ్ డిస్‌ప్లే, 2340 × 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూషన్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 675 ప్రాసెస‌ర్‌, 6/8 జీబీ ర్యామ్‌, 256/128 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయ‌ల్ సిమ్‌, 48, 8, 5 మెగాపిక్స‌ల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 32 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3700 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌.