ఇరాన్ దేశం వరదలతో అతలాకుతలం అవుతోంది. భారీ వర్షాల కారణంగా వరదలు పోటెత్తుతున్నాయి. జనం ఇళ్ల నుంచి రోడ్లపైకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. కాగా.. రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. రోడ్లపై ఉన్న కార్లు నీటిలో తేలియాడుతున్నాయి. అంతుచిక్కని వరదలతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు వారాల్లో మూడోసారి వరదలు పోటెత్తడంతో.. ప్రాణాలను అరచేతిలో పెట్టుకున్నారు బతుకుతున్నారు ఇక్కడి జనం. కాగా.. అటు నేపాల్, అమెరికాలో కూడా వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ వరదల కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు.