హోలీ వేడుకలు జరుపుకొంటుండగా.. బాలికపై రేప్, హైదరాబాద్ లో దారుణం

SMTV Desk 2019-03-22 14:04:23  Hyderabad, Rape.

హైదరాబాద్‌ నగరంలో నిన్న అందరూ హోలీ వేడుకలు జరుపుకొంటుండగా, అదే సమయంలో ఒక దారుణమైన సంఘటన జరిగింది. నగరంలోని ఆల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరేళ్ల బాలికపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసి బాలిక గొంతుకోసి చంపి సమీపంలోని పొదలలో పారేసి పారిపోయారు. ఆ చిన్నారి తన స్నేహితులు, అన్నయ్యతో కలిసి ఆల్వాల్ లో హోలీ ఆడుకొంటుండగా ఒక గుర్తు తెలియని వ్యక్తి వచ్చి ఆమెకు మాయమాటలు చెప్పి తీసుకువెళ్ళాడు. అనంతరం అతను మరికొందరితో కలిసి ఆ బాలికపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసులు ప్రాధమిక దర్యాప్తులో బయటపడింది. బీహార్‌కు చెందిన ముఠా ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని వారి కోసం గాలిస్తున్నారు. నానాటికీ పెరిగిపోతున్న ఇటువంటి దారుణాలకు అడ్డుకట్ట పడేదెప్పుడో?