లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నయా పాలసీ

SMTV Desk 2019-03-22 14:03:33  LIC,

భారతదేశంలో అతిపెద్ద బీమా కంపెనీ లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ‘Navjeevan Plan No.853’ పేరుతో మరో సరి కొత్త పాలసీని ప్రారంభించింది.

ఇక వివరాల్లోకి వెళితే 2019 మార్చి 18 నుంచే ఈ కొత్త పాలసీ అమలులోకి వచ్చింది. ఇది నాన్-లింక్డ్ ఎండోమెంట్ ప్లాన్. నవజీవన్ ప్లాన్‌లో కస్టమర్లు రెండు రకాల ప్రీమియంలు ఎంచుకోవచ్చు. అందులో ఒకటి సింగిల్ ప్రీమియం కాగా మరొకటి ఐదేళ్ల లిమిటెడ్ ప్రీమియం. ఎల్ఐసీ ప్రారంభించిన నవజీవన్ ప్లాన్-853 గురించి పూర్తి వివరాలు, ఆ పాలసీతో గల లాభాల గురించి తెలుసుకోండి.

పాలసీ టర్మ్: 10 నుంచి 18 ఏళ్లు
ప్రీమియం: సింగిల్ లేదా ఐదేళ్లు

కనీస బీమా మొత్తం: రూ.1 లక్ష
గరిష్ట బీమా మొత్తం: పరిమితి లేదుకనీస వయస్సు: సింగిల్ ప్రీమియం 90 రోజులు, నాన్ సింగిల్ ప్రీమియంకు 90 రోజులు(ఆప్షన్-1), 45 ఏళ్లు(ఆప్షన్-2)
గరిష్ట వయస్సు: సింగిల్ ప్రీమియంకు 44 ఏళ్లు, నాన్ సింగిల్ ప్రీమియంకు 60 ఏళ్లు(ఆప్షన్-1), 65 ఏళ్లు(ఆప్షన్-2)

బెనిఫిట్స్

మెచ్యూరిటీ బెనిఫిట్స్: మెచ్యూరిటీ తర్వాత సమ్ అష్యూర్డ్‌తో పాటు లాయల్టీ అడిషన్ లభిస్తుంది.
డెత్ బెనిఫిట్స్: రిస్క్ తేదీ మొదలుకాకముందే చనిపోతే చెల్లించిన ప్రీమియం వాపసు ఇస్తారు. రిస్క్ తేదీ మొదలయ్యాక సమ్ అష్యూర్డ్ చెల్లిస్తారు. పాలసీ మొదలైన ఐదేళ్ల తర్వాత చనిపోతే సమ్ అష్యూర్డ్‌తో పాటు లాయల్టీ అడిషన్ లభిస్తుంది.
45 ఏళ్లు దాటినవాళ్లు ఆప్షన్ 1 ఎంచుకుంటే వార్షిక ప్రీమియంకు 10 రెట్లు డెత్ బెనిఫిట్స్
ఆప్షన్ 2 ఎంచుకుంటే వార్షిక ప్రీమియంకు 7 రెట్లు డెత్ బెనిఫిట్స్
45 ఏళ్ల లోపు అయితే ఆప్షన్ 1 మాత్రమే వర్తిస్తుంది.