లేటెస్ట్ రికార్డు: 25 బంతుల్లో సెంచరీ..

SMTV Desk 2019-03-22 14:01:50  Engaland,

దుబాయ్: ఓ 20 ఏళ్ల ఇంగ్లండ్ యువకుడు విల్ జాక్స్ క్రికెట్ ఫీల్డ్‌లో పెను సంచలనం సృష్టించాడు. దుబాయ్‌లో జరుగుతున్న టీ10 లీగ్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో జాక్స్ కేవలం 25 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఏకంగా ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కూడా బాదాడు . మొత్తం 11 సిక్స్‌లు, 8 ఫోర్లతో కేవలం 30 బంతుల్లోనే 105 పరుగులు చేశాడు. దీంతో అతడు ఆడుతున్న సర్రే టీమ్ పది ఓవర్లలో 3 వికెట్లకు 176 పరుగుల భారీ స్కోరు చేసింది. ఒక దశలో తాను ప్రతి బంతినీ సిక్స్ కొట్టాలన్నట్లుగా ఆడానని మ్యాచ్ తర్వాత జాక్స్ చెప్పాడు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లాంకషైర్ టీమ్.. 81 పరుగులు మాత్రమే చేయగలిగింది.