పబ్ జీ గేమ్‌ ఎఫెక్ట్ : మెదడుపై ఒత్తిడి పెరిగి... పిల్లలు చనిపోతున్నారు

SMTV Desk 2019-03-22 12:39:59  pub g,

పబ్ జీ గేమ్‌కు బలవుతున్న వారి సంఖ్య నానాటికి పెరుగుతోంది. నిన్నటివరకు బ్లూవెల్ గేమ్ మనుషుల్ని మింగితే.. ఇప్పుడు ఆన్ లైన్ పబ్ జీ గేమ్‌ వచ్చి పిల్లల ప్రాణాలు బలితీసుకుంటుంది. తాజాగా పబ్ జీ గేమ్‌ ఓ యువకుడి ప్రాణాలు బలితీసుకుంది. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా రాజారాంపల్లికి చెందిన సాగర్ అనే యవకుడు పబ్ జీకు పూర్తిగా అడిక్ట్ అయిపోయాడు. నిత్యం గేమ్ ఆడుతుండటంతో ఒక్కసారిగా అతడి నరాలు పట్టేశాయి. దీంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు అతని తల్లిదండ్రులు. 46 రోజుల పాటు చికిత్స పొందిన సాగర్ ఇవాళ మృతిచెందాడు. పబ్ జీ గేమ్‌ ఆడుతుండటం వల్ల మెదడుపై ఒత్తిడి పెరిగి... పిల్లలు చనిపోతున్నారని ప్రముఖ డాక్టర్లు చెబుతున్నారు. ఈ గేమ్ వల్ల నరాలకు సంబంధించిన వ్యాధులు కూడా ఎక్కువగా వస్తున్నాయని హెచ్చరిస్తున్నారు.

ఆన్ లైన్ గేమ్ పబ్ జీ(PUBG)కి బానిసలైపోతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. ఇప్పటికే అనేకమంది పబ్ జీ ఆడి మెంటల్ బాలెన్స్ కోల్పోయి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ గేమ్ ఆడి పలువురు ప్రాణాలు కొల్పోయారు. గేమ్ లో లానే బయట ప్రపంచంలో కూడా ప్రవర్తిస్తున్నారు. దీంతో పబ్ జీ గేమ్ ని భారత్ లో నిషేధించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు పబ్ జీ గేమ్‌పై నిషేధం విధించాయి.