నితిన్ తో చంద్రశేఖర్ యేలేటి సినిమా

SMTV Desk 2019-03-22 12:14:43  nithin, chandrasekhar yeleti,

లవర్ బోయ్ నితిన్ శ్రీనివాస కళ్యాణం తర్వాత ఏ సినిమా చేస్తాడన్న కన్ ఫ్యూజన్ ఉంది. ఛలో డైరక్టర్ వేణు కుడుముల డైరక్షన్ లో భీష్మ సినిమా ఉంటుందని అన్నారు కాని ఆ సినిమా కంటే ముందే నితిన్ మరో సినిమా కన్ ఫాం చేశాడు. హోళీ పండుగ సందర్భంగా నితిన్ తన తర్వాత సినిమా టాలెంటెడ్ డైరక్టర్ చంద్రశేఖర్ యేలేటితో చేస్తున్నాడని అఫిషియల్ గా చెప్పాడు.

చంద్రశేఖర్ యేలేటి సినిమాలకు చాలా మంది అభిమానులు ఉన్నారు.. ఐతే నుండి మూడేళ్ల క్రితం వచ్చిన మనమంతా వరకు ప్రతి సినిమా కొత్తగా ట్రై చేస్తాడు చంద్రశేఖర్ యేలేటి. ప్రస్తుతం ఫ్లాపులతో సతమతమవుతున్న నితిన్ యేలేటి సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి. ఈ సినిమాను భవ్య ఆర్ట్స్ క్రియేషన్స్ లో ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబందించిన మిగతా కాస్ట్ అండ్ క్రూ త్వరలో వెళ్లడిస్తారట.