నాలుగేళ్ల గరిష్టస్టాయికి చేరుకున్న వెండి

SMTV Desk 2019-03-22 12:05:36  Gold Rate, Silver rate, Bullion market

ముంబై, మార్చ్ 21: వెండి గిరాకి నాలుగేళ్ల గరిష్టస్టాయికి చేరింది. 2018లో మన దేశం 6442 టన్నుల వెండిని దిగుమతి చేసుకుంది. ఈ ఏడాది అది 6590 టన్నులకు పెరగవచ్చని మార్కెట్‌ వర్గాలు చెపుతున్నాయి. మూడేళ్ళ తర్వాత మళ్లీ ఇప్పుడు ఆ స్థాయిలో మనం వెండిని దిగుమతి చేసుకుంటున్నాం. తెలంగాణలో ఇప్పటికే రైతు బంధ పథకం అమల్లో ఉంది. వీటి వల్ల బంగారం కంటే వెండికి డిమాండ్‌ పెరిగిందని గోల్డ్‌ మర్చెంట్స్‌ చెబుతున్నారు. గత రెండేళ్లుగా వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. పెద్దగా వీటిలో భారీ మార్పుల్లేవు. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.38వేల వరకూ పలుకుతోంది. 2017లో భారీగా తగ్గిన వెండి దిగుమతులు, 2018లో మాత్రం 36 శాతం పెరిగాయి. 2019లో కూడా 7 వేల టన్నులకు పైపడే ఇంపోర్ట్స్‌ ఉండొచ్చని వివిధ రీసెర్చ్‌ సంస్థలు విశ్లేషిస్తున్నాయి. ట్రేడ్‌ మినిస్ట్రీ లెక్కల ప్రకారం 2015లో అత్యధికంగా మనం 7579టన్నుల వెండిని వివిధ దేశాల నుంచి ఇంపోర్ట్‌ చేసుకున్నాం.