ఓకే ఇంట్లో 45 విషసర్పాలు

SMTV Desk 2019-03-22 11:47:00  Texas, 45 Snakes From Under Texas House, Dozens of rattlesnakes removed

టెక్సాస్, మార్చ్ 21: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఓ ఇంట్లో 45 పాములు బయటపడ్డాయి. తన ఇంట్లో ఒక్కసారిగా అన్నేసి పాములను చూసి ఆ యజమాని జడుసుకున్నాడు. తర్వాత పాములు పట్టేవాళ్లను పిలిచి, వాటిని చంపకుండా పట్టి, సురక్షిత ప్రాంతానికి తరలించారు. వాటిని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్తా వైరల్ అయింది. ఈ సందర్భంగా ఆ ఇంటి యజమాని మాట్లాడుతూ.. ‘మధ్యాహ్నం భోజనం చేయడానికి ఇంటికి వచ్చాను. ఇంట్లోకి వెళ్తున్న క్రమంలో బయట కేబుల్ పైన చిన్న రాటిల్ పాము కనిపించింది. నాకప్పుడే అనుమానం వచ్చింది. మెల్లగా వెళ్లి చూశాను. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 45 పాములు కనిపించాయి. వామ్మో నా ఇల్లు పాములకు అడ్డా అయిపోయిందా అని ఒంట్లో వణుకుపుట్టింది. తర్వాత స్థిమితపడ్డాను. ధైర్యం కూడగట్టుకున్నాను. వెంటనే పాములు పట్టే సంస్థకు సమాచారం అందించాను. వాళ్లొచ్చి అన్నీ పాములను పట్టి సురక్షిత ప్రాంతంలో వదిలిపెట్టారు’ అని తెలిపారు. ఇంత చెప్పిన ఆయన తన పేరును వెల్లడించడానికి ఇష్టపడలేదు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.