ఫింగర్‌ప్రింట్‌ తోనే స్టార్ట్ : యమహా ఆర్15 మోడిఫైడ్ వెర్షన్

SMTV Desk 2019-03-22 11:35:31  Yamaha R15, Yamaha R15 V2 with Fingerprint , touch screen, yamaha r15 modified version

మార్చ్ 21: టెక్నాలజీ అన్ని రంగాల్లో దూసుకేల్తోంది. బ్యాంకింగ్, ఐటీ, ఆటో, ఈ-కామర్స్ వంటి వివిధ రంగాలకు కొత్త సాంకేతికత విస్తరిస్తోంది. వాహన రంగంలోనూ దీని సత్తా చాటుకుంటుంది. అందులో భాగంగానే ఇప్పుడు బైక్స్‌ను ఫింగర్‌ప్రింట్‌ టెక్నాలజీతో స్టార్ట్ చేసే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. యమహా ఆర్15 బైక్‌ మన మార్కెట్‌లో చాలా పాపులర్. క్లాస్ లుక్, సూపర్ డిజైన్, ఇంజినీరింగ్ నైపుణ్యం, అదిరిపోయే పనితీరు వంటి వాటికి ఈ బైక్‌ను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ బైక్‌లో మోడిఫైడ్ వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. ఇందులో క్రూయిజ్ కంట్రోల్, జీపీఎస్ నావిగేషన్, ఫింగర్‌ప్రింట్ స్కానర్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. అలాగే ఈ బైక్‌‌లో టచ్ స్క్రీన్ కూడా ఉంటుంది. మొబైల్ ఫోన్ ద్వారా కంట్రోల్ చేయవచ్చు. యాంటీ థెఫ్ట్ అలారం ఉంది. కాల్ నోటిఫికేషన్, మెసేజ్ అలర్ట్స్, ఆటో హెడ్‌లైట్, ఆటో ఫోల్డిండ్ రియర్ వ్యూ మిర్రర్స్, రియర్ వ్యూ కెమెరా, వాయిస్ కంట్రోల్, బ్యాటరీ మీటర్ వంటి పలు ఫీచర్లు ఉన్నాయి. ఇకపోతే యమహా ఆర్ 15లో 150 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది.