బిగ్ బాస్ 3 హోస్ట్‌గా విజయ్ దేవరకొండ

SMTV Desk 2019-03-22 11:27:30  Bigboss, Vijay Devarakonda,

బిగ్ బాస్ 3 హోస్ట్‌గా రోజుకో కొత్త పేరు తెరమీదకు వస్తోంది. గత సీజన్ నని హోస్ట్ చేయగా ఆయన అంతగా పెర్ఫార్మెన్స్ ఇవ్వలేదని భావించిన నిర్వాహకులు మళ్ళీ జూనియర్ వెంట పడ్డారు, అయితే రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్‌లో బిజీగా ఉండడంతో హోస్ట్‌గా వ్యవహరించేందుకు జూనియర్ నిరాకరించడంతో బిగ్ బాస్ నిర్వాహకులు అక్కినేని నాగార్జునతో టచ్‌లోకి వెళ్లినట్లు రెండ్రోజుల క్రితం కథనాలు వెలువడ్డాయి. బిగ్ బాస్ 3 హోస్ట్‌గా నాగార్జున పేరు దాదాపు కన్ఫర్మ్ అయినట్లు కూడా మీడియా వర్గాల్లో కూడా గట్టి చర్చే సాగింది.

తాజాగా ఈ లిస్టులోకి టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ వచ్చి చేరాడు. నాగార్జునను సంప్రదించినప్పుడు పాజిటివ్ రెస్పాన్స్ రాలేదని ఇతర కమిట్మెంట్స్ ఉన్నాయని అందుకే బిగ్ బాస్ హోస్ట్ గా చేసేందుకు ఆయన పెద్దగా ఆసక్తి చూపడం లేదని సమాచారం. దీంతో బిగ్ బాస్ ఆర్గనైజర్లు విజయ్ దేవరకొండను సంప్రదించారట. కానీ విజయ్ ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. దీంతో తనకు బిగ్ బాస్ కోసం డేట్లు ఇచ్చే పరిస్థితి లేదని అంటున్నాడట. కానీ బిగ్ బాస్ నిర్వాహకులు మాత్రం ఎలాగైనా రౌడీ స్టార్ ను బిగ్ బాస్ లోకి తీసుకొచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారట. త్వరలో ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. చూడాలి మరి రౌడీ నా కింగా అనేది