‘ఐరా’ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌

SMTV Desk 2019-03-21 17:51:17  Airaa, Nayanatara, airaa teaser

సర్జన్ కేఎం దర్శకత్వంలో నయనతార ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ‘ఐరా’. కేజేఆర్ స్టూడియోస్ ప్రొడక్షన్ బ్యానర్‌పై కోటపాడి జె రాజేష్, మహేశ్వర్ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో కలైరసన్, యోగిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంతో నయన్ తమిళ్‌తో పాటు తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ‘ఐరా’ సినిమా నుంచి థియేట్రికల్ ట్రైలర్‌ను చిత్రబృందం రిలీజ్ చేసింది.



దెయ్యాలున్నాయని నమ్మించేందుకు నయనతార చేసిన ప్రయత్నం ఆమెను ఎలా ఇబ్బందుల్లో పడేసిందనే ఇతివృత్తంతో ఈ చిత్రం తెరకెక్కినట్టు ట్రైలర్‌ని బట్టి అర్థమవుతోంది. ‘నీకు భవాని ఎవరో ఏంటో తెలుసా?’ అనే వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ‘ఇప్పుడున్న ఇంటర్నెట్ సినారియోలో కాంట్రవర్షియల్‌గా కంటెంట్ ఉంటేనే ఆడియెన్స్ చూస్తారు. సూపర్‌గా ఉన్న సినిమాను డబ్బా అనాలి..’ అంటూ నయన్ ఓ కాన్సెప్ట్‌ని సక్సెస్ చేసుకోవడానికి చెప్పే ట్రిక్స్ ఆకట్టుకున్నాయి. ‘లోకంలో ఎవరూ ఇవ్వని సంతోషాన్ని నువ్వు నాకు ఇచ్చావు అభి .. దానిని దూరం చేసిన ఎవరినీ నేను ప్రాణాలతో వదలను’ అంటూ నయన్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది. మొత్తంగా ఈ సినిమా నయన్ ఖాతాలో మరో హిట్‌ను జమ చేయడం ఖాయమనిపిస్తోంది.