విజయ్ సినిమాకు భారీ డీల్

SMTV Desk 2019-03-21 17:34:02  Vijay, Cinema, thalapathy vijay

ఇళయదళపతి విజయ్ ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్లో నటిస్తున్న సంగతి తెలిసిందే, ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు కాక ముందే భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. మెర్సల్, సర్కార్ సినిమాలతో అలవోకగా 200 కోట్ల క్లబ్ లో చేరిన విజయ్ ఈ సినిమాతో కూడా ఆ మార్క్ ను రీచ్ అయ్యేలా ఉన్నాడుఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇంకా మొదలేకాలేదు అప్పుడే బిజినెస్ డీల్స్ ఓ రేంజ్ లో సెట్టవుతున్నాయి. రీసెంట్ గా సినిమాకు సంబందించిన డిజిటల్, శాటిలైట్ రైట్స్ మొత్తం 60 కోట్లకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. సన్ నెట్వర్క్ అన్ని భాషల్లో సినిమా హక్కుల్ని దక్కించుకున్నట్లు సమాచారం.

స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో విజయ్ కోచ్ గా కనిపించనున్నాడు, ఫుట్ బాల్ టీమ్ కోచ్ గా సొసైటీలోని సమస్యలపై పోరాడే వ్యక్తిగా కనిపించనున్నాడు.2020లో విడుదల కానున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి, షూటింగ్ కూడా మొదలు కాకముందే భారీ స్థాయిలో బిజినెస్ జరుపుకుంటున్న ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.