డిస్ట్రిబ్యూటర్లకు ఉరట

SMTV Desk 2019-03-21 16:07:35  Amazon Prime, cinema industry

అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లాంటి డిజిటల్ ప్లాట్ ఫామ్ ల రాకతో సినిమాలు థియేటర్లలో ఉండగా డిజిటల్ ప్లాట్ ఫామ్స్ పై స్ట్రీమ్ అవ్వటం డిస్ట్రిబ్యూటర్లకు పెద్ద తలనొప్పిగా మారింది. చాలా వరకు సినిమాలు విడుదలైన నెల రోజులకే అమేజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అయ్యాయి, దీంతో ఎక్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నష్టపోవాల్సి వచ్చింది. హిట్ టాక్ ఉన్న సినిమాలైతేనే ఆడియెన్స్ కచ్చితంగా థియేటర్ల దాకా వెళ్లి చూస్తున్నారు కానీ, సినిమా టాక్ ఏ మాత్రం అటు ఇటుగా వచ్చినా కూడా నెల తిరిగేలోపు డిజిటల్ ప్లాట్ ఫామ్ లో చూడొచ్చన్న భావనతో యావరేజ్, బిలో యావరేజ్ సినిమాల వైపు చూడటం మానేశారు. ఈ క్రమంలో డిస్ట్రిబ్యూటర్లు ఏం చేయాలో తెలియక తల పట్టుకున్న పరిస్థితి ఏర్పడింది.

తాజాగా తెలుగు సినిమా నిర్మాతల మండలి తీసుకున్న నిర్ణయం డిస్ట్రిబ్యూటర్లకు ఉరటనిచ్చేలా ఉంది, ఇక టీవీ చానళ్లకు, డిజిటల్ ప్లాట్ ఫామ్స్ కు డిజిటల్, శాటిలైట్ రైట్స్ ను విడుదల తేదీకి స్ట్రీమింగ్ తేదీకి 56రోజులు అంటే 8వారలు గ్యాప్ ఉండేలా అగ్రిమెంట్ చేసుకోవాలని నిర్ణయించింది. ఈ కొత్త నిబంధన ఏప్రిల్ 1నుండి అమలులోకి రానుంది. మొత్తానికి నిర్మాతల మండలి తీసుకున్న ఈ నిర్ణయం డిస్ట్రిబ్యూటర్లకు కొంతవరకు నష్టాల బారి నుండి తప్పించినట్లే అవుతుంది.