నష్టాల్లో మారుతి సుజుకీ

SMTV Desk 2019-03-19 12:42:33  maruti suzuki, maruti, maruti shares, maruti passengers

న్యూఢిల్లీ, మార్చ్ 18: ఆటోమొబైల్స్ తయారీలో దిగ్గజం మారుతి సుజుకీ షేర్లు అమ్మకాలతో నీరసించింది. ఎన్‌ఎస్‌ఇలో మొదట మారుతి షేరు గత ముగింపు రూ.7084తో పోలిస్తే రూ.6777దిగువకు తగ్గింది. ప్రస్తుతం కొంత కోలుకుని 4 శాతం నష్టంతో రూ.6822వద్ద ట్రేడవుతోంది. కార్లకు డిమాండ్‌ తగ్గుతున్న అంచనాలతో మారుతి ఉత్పత్తిలో కోత పెడుతున్నట్లు పరిశ్రమవర్గాలు వెల్లడించాయి. ప్యాసింజర్‌ వాహనాలకు డిమాండ్‌ కొంత తగ్గి మారుతి సుజుకి ఉత్పత్తి 1,72,000యూనిట్ల నుంచి 1,26,000 యూనిట్లకు కుదించినట్లు మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇది 27 శాతం క్షీణించిందని సమాచారం. మరోవైపు యాంటిక్‌ స్టాక్‌ బ్రోకింగ్‌ మారుతి షేరుకి అమ్మకం రేటింగ్‌ను కొనసాగిస్తున్నట్లు తెలియచేసింది. మార్కెట్‌ ధరతో పోలిస్తే 22 శాతం తక్కువగా రూ.5305టార్గెట్‌ ధరను కూడా ప్రకటించింది.