విమాన ప్రయాణం ఇక భారమే!!

SMTV Desk 2019-03-02 15:34:16  ATF price, aeroplanes, ATF Fules

న్యూఢిల్లీ, మార్చ్ 2: దాదాపు నాలుగు నెలల తరువాత విమాన ఇంధనం ధరలు మళ్ళీ ఎగిసిపడ్డాయి. అలాగే అంతర్జాతీయ విపణిలో ఇంధన ధరలు భారీగా పెరుగడంతో ఈ ఏడాది గరిష్ఠ స్థాయికి చేరుకున్నదని ప్రభుత్వరంగ ఇంధన విక్రయ సంస్థ తెలిపింది.

అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న ఇంధన ధరలకు, విదేశీ మారకం రేట్లకు అనుగుణంగా ప్రతి నెల ఒకటో తేదీన జెట్ ఫ్యూయల్ ధరల్లో మార్పులు చేస్తున్నాయి ప్రభుత్వరంగ ఇంధన విక్రయ సంస్థలు. ఫిబ్రవరిలో ధరలను ఇంధన విక్రయ సంస్థలు యథాతథంగా కొనసాగించాయి. దీంతో ఢిల్లీ విమానాశ్రయ పరిధిలో ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) కిలో లీటర్ ధర రూ.4,734.15 లేదా 8.15 శాతం పెరిగి రూ.62,795.12కి చేరుకున్నది.