స్టాఫ్ కి ఫ్రీగా బ్యాంకాక్ ట్రిప్...

SMTV Desk 2019-01-31 17:47:42  Dil raju, F2 movie, Success party, Staff Bangkok trip

హైదరాబాద్, జనవరి 31: ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఏడాది ఆరంభంలో ఎఫ్2 సినిమాతో భారీ లాభాలను పొందాడు. అయితే ఈ ఆనందంలోనే తనతో ఈ సినిమా కోసం పని చేసిన కొందరు స్టాఫ్ కి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్నాడు. విశాఖపట్టణం, హైదరాబాద్ లలో మొత్తం ఇరవై మంది స్టాఫ్ ని రేపు బ్యాంకాక్ ట్రిప్ కి పంపిస్తున్నాడు దిల్ రాజు. ఈ ఇరవై మందిని కూడా తన సొంత ఖర్చుతో నాలుగైదు రోజులు పాటు బ్యాంకాక్ ట్రిప్ కి పంపిస్తున్నారు. దీనంతటికీ పాతిక లక్షల వరకు ఖర్చవుతుందని తెలుస్తోంది.

కానీ ఆ మొత్తాన్ని పెద్దగా లెక్క చేయడం లేదని తన స్టాఫ్ ఆనందం కోసం ఈ ట్రిప్ ని ఎరేంజ్ చేసినట్లు తెలిపాడు. ఎఫ్ 2 సినిమా ఇచ్చిన సక్సెస్ అలాంటిది మరి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ సినిమా అరవై కోట్ల వసూళ్లు, వంద కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ సినిమా విడుదలైన తరువాత టాలీవుడ్ మరే హిట్ సినిమా రాలేదు. ఈ వారంలో కూడా సినిమాలు లేకపోవడంతో ఎఫ్ 2 కి కలిసొస్తోంది. వొక్క నైజాంలోనే ఈ సినిమా ఈ వారంతో కలిపి రూ.23 కోట్లు రాబడుతుందని అంచనా వేస్తున్నారు.